‘సీటీమార్’ సినిమా టీజర్ అప్డేట్
- February 21, 2021
హైదరాబాద్:టాలీవుడ్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’.మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రేపు ఉదయం 10:36 కు విడుదల చేయనున్నారు. ఈమేరకు చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







