‘సీటీమార్’ సినిమా టీజర్ అప్డేట్
- February 21, 2021హైదరాబాద్:టాలీవుడ్ హీరో గోపీచంద్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’.మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ తర్వాత గోపిచంద్, సంపత్ నంది కలయికలో వస్తున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భూమిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశి నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అప్డేట్లను ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రేపు ఉదయం 10:36 కు విడుదల చేయనున్నారు. ఈమేరకు చిత్రబృందం పోస్టర్ విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!