షార్జా లో సరికొత్త ఆకర్షణ..వెన్నెలలో సేదతీరేందుకు డోములు..
- February 22, 2021
యూఏఈ: ఎడారిలో అలా సరదాగా చంద్రుడిని చూస్తూ నక్షత్రాల తళుకులమధ్య ఒక చిన్న గుడారం వేసుకొని అందులో సేదతీరితే ఆ మజానే వేరు..ఈ ఆలోచనతో మిమ్మల్ని కట్టిపడేసేందుకు ముందుకొచ్చింది షురూక్..అదే మలీహా ప్రాంతంలో రాబోతున్న 'మూన్ రిట్రీట్'..
కాంస్య యుగం నాటి సమాధులు మరియు ఇస్లామిక్ రాచరపు కోటలకు నిలయం, యునెస్కో ప్రకటించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి షార్జాలోని మలీహా ప్రాంతంలో మార్చి చివరి నాటికి అతిథులను స్వాగతించడానికి 'మూన్ రిట్రీట్' సిద్ధంగా ఉన్నట్లు షార్జా ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (షురూక్) ప్రకటించింది.
ఆకర్షణలు
ఈ గుడారాలలో వంట చేసుకునే సౌకర్యం, బాత్రూమ్లతో సహా రాత్రిపూట బస చేయడానికి మీకు కావలసిన అన్ని సౌకర్యాలను కలిగి ఉంటుంది. కొన్ని గుడారాలకు ప్రైవేట్ కొలనులు కూడా ఉన్నాయండోయ్..ఇక, బార్బెక్యూ/భోజన బుకింగ్ సదుపాయాలూ చలి మంటలకు ప్రత్యేక ఏర్పాట్లు, చుట్టుపక్కల కొండలలో స్టార్గేజింగ్ మరియు హైకింగ్ వంటి కార్యకలాపాలు ఈ క్యాంపింగ్ ప్రత్యేకతలు.
బుకింగ్లు
ఇక్కడ పది సింగిల్ బెడ్ డోములు, నాలుగు ఫ్యామిలీ గుడారాలు మరియు రెండు సింగిల్ బెడ్ గుడారాలు లభ్యమవుతాయి. మూన్ రిట్రీట్లోకి బుకింగ్ చేసే అతిథులు వీటిలో తమ అవసరానికి తగ్గ డోము/గుడారాన్ని ఎంచుకోవచ్చు. మరింత సమాచారం కోసం www.shurooq.gov.ae ని సందర్శించండి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







