నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, ఖతార్ కంపెనీకి ఫైన్
- May 30, 2015
ఖతార్ న్యాయస్థానం, ఓ కార్మికుడి మృతి పట్ల సీరియస్‌గా స్పందించింది. నిర్మాణ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే క్రేన్ ప్రమాదంలో కార్మికుడు మృతి చెందినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. క్రేన్ ఆపరేటర్, కన్‌స్ట్రక్షన్ కంపెనీకి వెయ్యి రియాల్స్ ఫైన్ విధించడంతోపాటు, బాధితుడికి ఆర్థిక సహాయం అందించాలని తీర్పునిచ్చింది. మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆ నిర్మాణ సంస్థకూ ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పాత విమానాశ్రయం దగ్గర్లోగల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో జనవరి 5వ తేదీన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు.డామన్ సంస్థ ఈ నిర్మాణం చేపడ్తోంది. ఏడు వందల కిలోల బరువున్న పైప్‌లను పైకి లేపే ప్రయత్నంలో, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఆ వ్యక్తి మృతి చెందినట్లు విచారణలో తేలింది.
----వనంబత్తిన రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







