‘గాలి సంపత్’ ట్రైలర్ విడుదల
- February 27, 2021
హైదరాబాద్:యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న సినిమా ‘గాలి సంపత్’. శ్రీ విష్ణు సరసన లవ్‌లీ సింగ్ కథానాయికగా నటించింది. రాజేంద్రప్రసాద్ గాలి సంపత్‌గా టైటిల్ రోల్ పోషించారు. అనిష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ నటన ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అలరిస్తుంది. మార్చి 11న మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







