తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల వివరాలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసింది.అయితే తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు... ఇదే సమయంలో 148 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,631 కు చేరుకోగా.. 2,95,059 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,633 మంది మృతిచెందారు.దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.80 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,939 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 850 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 40,821 శాంపిల్స్ టెస్ట్ చేశామని..ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 86,59,666 కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







