అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు..
- February 27, 2021
న్యూ ఢిల్లీ:కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన ఆంక్షలను మార్చి 31 వరకు పొడిగిస్తూ తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సేవలకు సంబంధించిన ఈ ఆంక్షలు 2021 మార్చి అర్థరాత్రి 11.59 గం.ల వరకు అమల్లో ఉంటాయని విమానయాన సంస్థ తెలిపింది.
అయితే కార్గో విమానాలు, ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా నడుస్తున్న ప్రత్యేక ఫ్లైట్స్‌కు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం భారత్ సుమారు 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. ఈ దేశాల నుంచి భారత్ కు రాకపోకలు సాగించే విమానాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం గతేడాది మార్చి 25 నుంచి పూర్తిగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిషేధించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మే 25 నుంచి డొమెస్టిక్ ఫ్లైట్స్ కు అనుమతిచ్చింది.కానీ గత 11 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం అలాగే కొనసాగుతోంది.మళ్లీ ఇప్పుడు నెల రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష