విశాఖకు భారీగా తరలిస్తున్న దొంగనోట్ల కట్టలు సీజ్
- March 03, 2021
విశాఖపట్నం:విశాఖకు తరలిస్తున్న దాదాపు 8 కోట్ల రూపాయల దొంగనోట్ల కట్టలను సీజ్ చేశారు పోలీసులు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా దొంగనోట్లు పట్టుబడడం కలకలం రేపుతోంది. ఒడిశాలోని సుంకి గ్రామంలో ఆంధ్రా-ఒడిశా చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా అంతరాష్ట్ర దొంగనోట్ల ముఠా కంటపడింది. వాహనాన్ని తనిఖీ చేయగా 7 కోట్ల 90 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. ట్రాలీ బ్యాగ్‌లలో దొంగనోట్లను రాయ్‌పూర్ నుంచి విశాఖకు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. దొంగనోట్లను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఒడిశా పోలీసులు కారును సీజ్ చేశారు. ఎన్నికల్లో పంచడానికే దొంగనోట్లను విశాఖకు తరలిస్తున్నారా.. వేరే వ్యవహారం ఉందా అనే దానిపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వీరి నుంచి 5 మొబైల్ ఫోన్లు, 35 వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు సీజ్ చేశారు. వీళ్ల ఐడీ ప్రూఫ్‌ల ఆధారంగా తెరవెనుక సూత్రధాలు ఎవరో కనిపెట్టేందుకు విచారణ మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







