ఫార్మసీల ద్వారా ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్..
- March 04, 2021
సౌదీ:కింగ్డమ్ లోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు వ్యాక్సిన్ అందించేందుకు అవసరమైన చర్యలను ముమ్మరం చేస్తోంది సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇందుకోసం ఇక నుంచి ఫార్మసీల ద్వారా కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అల్-దవా ఫార్మసీతో ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు కింగ్డమ్ వ్యాప్తంగా అల్-దవా ఫార్మసీ బ్రాంచుల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నాయి. కింగ్డమ్ వ్యాక్సిన్ప పర్మిషన్ పొందిన తొలి ఫార్మసీ అల్-దవా కావటం విశేషం. ఫార్మసీ ద్వారా కింగ్డమ్ లోని పౌరులు, ప్రవాసీయులు వ్యాక్సిన్ పొందవచ్చు. అయితే..వ్యాక్సినేషన్ ఎప్పుడు ప్రారంభించేది అల్-దవా ఫార్మసీ త్వరలోనే ప్రకటించనుంది. ప్రజల ఆరోగ్య భద్రత కోసం కింగ్డమ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తోందని, అందుకోసం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..కింగ్డమ్ లోని అన్ని ఫార్మసీల ద్వారా ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







