యూఏఈ:కోవిడ్ రూల్స్ బ్రేక్..క్రికెట్ ఆడుతున్న 13 మందికి ఫైన్

- March 04, 2021 , by Maagulf
యూఏఈ:కోవిడ్ రూల్స్ బ్రేక్..క్రికెట్ ఆడుతున్న 13 మందికి ఫైన్

యూఏఈ:ఓ వైపు సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తుంటే..కొందరు యువతకు మాత్రం అవేం పట్టడం లేదు. బహిరంగ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే దగ్గర పోగవ్వొద్దని సూచించిన ఆరోగ్య శాఖ..సమాజ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..షార్జాలో కొందరు యువకులు ఆరోగ్య శాఖ సూచనలను, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా క్రికెట్ ఆడుతూ బుక్కైపోయారు. అనుమతి లేని ప్రాంతంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడుతూ పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన 13 మందికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటం తమ బాధ్యతని..నిరంతరం పాట్రోలింగ్ బృందాల నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com