ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ సెక్టార్ కి వలస కార్మికుల బదిలీ

- March 04, 2021 , by Maagulf
ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ సెక్టార్ కి వలస కార్మికుల బదిలీ

కువైట్ సిటీ:కోవిడ్ సమయంలో కార్మిక శక్తి లోటును భర్తీ చేసేందుకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తన విశిష్ట అధికారాలను వినియోగించుకుంటోంది. ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న ప్రవాసీ ఉద్యోగులు/కార్మికులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసేందుకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నవారు అలాగే ఫ్యామిలీ వీసాలు కలిగిన వారిని ప్రైవేట్ రంగంలోకి బదిలీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, కోవిడ్ సంక్షోభం కారణంగా సేవలు నిలిచిపోయిన, నిషేధించిన రంగాల్లోని కార్మిక శక్తిని ఇతర రంగాల్లో వినియోగించుకోవాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, ఫిషింగ్, సహాకార సంఘాలు, ఫ్రీ ట్రేడ్ జోన్లోని ఉపాధి రంగాలను గుర్తించి నిషేధించబడిన రంగాల్లోని కార్మిక శక్తిని బదిలీ చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ నెం. 842లోని ఆర్టికల్-5లోని క్లాజ్ నెంబర్ 1 మేరకు అవసరం అనుకుంటే యజమానుల అనుమతితో స్థానిక కార్మిక శక్తిని వెంటనే ఇతర రంగాలకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే ఈ నిబంధన ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కార్మిక శక్తి బదలాయింపునకు వర్తించదని వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com