కువైట్లోని భారత ఎంబసీ సేవలు మార్చి 11 వరకు నిలిపివేత
- March 04, 2021
కువైట్ సిటీ:కువైట్లోని భారత ఎంబసీలో సాధారణ సేవలను మార్చి 11 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో ముందస్తు ఎంబసీ కార్యాలయం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 3, 4వ తేదీల్లో సాధారణ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆ తర్వాత సేవల నిలిపివేతను మరికొన్నాళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. దీంతో మార్చి 11 వరకు ఎంబసీలో సాధారణ సేవలు అందుబాటులో ఉండవు. అప్పటివరకు ఎవరినీ కార్యాలయంలోకి అనుమతించరు. అయితే..డెత్ కేస్ రిజిస్ట్రేషన్స్, ఐసీడబ్ల్యూఏఫ్ అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..