జాతి నిర్మాణంలో మహిళామణులదే కీలక భూమిక:ఏ.పీ గవర్నర్
- March 07, 2021
అమరావతి:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆంద్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించటంలో ఎల్లప్పుడూ కీలక భూమికను పోషిస్తూ వచ్చారని ప్రశంసించారు. మహిళలు ఎప్పుడూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కరోనాపై పోరులో సైతం ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, వైద్యులతో పాటు మహిళలు సైతం ముందు వరుసలో ఉన్నారని ప్రస్తుతించారు.భారత సామాజిక స్దితిగతుల మేరకు సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న వారు ఎంతో సహనంతో తమ కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్నారని,ఇది దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమతి అని గవర్నర్ కొనియాడారు. జాతి నిర్మాణంలో మహిళలు తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన వెలువడింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష