ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి...
- March 07, 2021
కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున 4 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి దాకా ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు 11 కోట్ల 71 లక్షల 45 వేల వరకూ రాగా.. 26 లక్షల మందికి పైగా మరణించారు.కొత్తగా జన్యుమార్పులు చోటు చేసుకున్న కొత్త వేరియంట్ పలు దేశాల్లో విస్తరిస్తున్నట్లు WHO గుర్తించింది.ముఖ్యంగా యూరోప్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.గత వారం రోజుల్లో యూరోప్ దేశాల్లో 10 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు అంతకు ముందు వారంతో పోలిస్తే 9 శాతం మేర కేసులు పెరిగినట్లు WHO పేర్కొంది.
ఇటలీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. అక్కడ వరుసగా మూడో రోజూ 20వేల దాకా కేసులు నమోదయ్యాయి.ఇటలీలో కోవిడ్ బాధితుల సంఖ్య 30 లక్షలు దాటింది.కరోనా తొలి రోజుల్లో నిర్ధరణ పరీక్షలు జరగనందున కేసుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అంచనా.వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 99 వేల 271కు చేరింది. తమ దేశానికి అత్యవసరంగా టీకాలు అందాల్సిన అవసరం ఉందని ఇటలీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇక ఇంగ్లాండ్‌తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాల్లో సమస్య కొవిడ్ కేసులు పెరుగుదల ఎక్కవగా ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ క్రమంగా పంజుకుంటోంది.
అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే కోవిడ్ కేసులు మరణాల సంఖ్యలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 96 లక్షల 54 వేలు దాటింది. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5 లక్షల 37 వేలు దాటేసింది. కాగా గత కొద్ది రోజులుగా అమెరికాలో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. నూతన అధ్యక్షుడు జో బైడెన్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు కొవిడ్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్ ప్రజలను ఆదుకునేందుకు జో బైడెన్ ప్రకటించిన 1.9 ట్రిలియన్ డాలర్ల సాయం అమలు దిశగా ముందడుగు పడింది.ఈ బిల్లును సెనెట్ ఆమోదించింది.రిపబ్లికన్ సభ్యులంతా వ్యతిరేకించిప్పటికీ ఈ బిల్లు 50-49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.ఈ బిల్లును వచ్చేవారం కాంగ్రెస్ ఆమోదం కోసం పంపిస్తారు. కరోనా వల్ల అమెరికా చాలా కాలం నష్టపోయిందని,అందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు అధ్యక్షుడు జో బైడెన్.అమెరికా పౌరులకు ఆర్థిక సాయం,పన్ను మినహాయింపులు చేయడం సహా కోవిడ్‌పై పోరాటానికి నిధులను వెచ్చిస్తారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష