మళ్లీ దుబాయ్‌కి రానున్న మహేష్..
- March 08, 2021
హైదరాబాద్:సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా విడుదల చేసి ఏడాది అవుతుంది. ప్రస్తుతం మహేష్ తాజాగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు.ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం వరకు దుబాయ్‌లో జరిగింది. అక్కడ రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకొని మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చారు.సినిమాలో మరో షెడ్యూల్‌ను యూఎస్‌లో చిత్రించాలని అనుకున్నారంట.కానీ కొన్ని కారణాల కారణంగా ఆ ప్లాన్ కాస్త మారి పోయిన సర్కారు వారి పాట టీమ్ మళ్లీ దుబాయ్‌కు బయలు దెరనున్నారు.ఈనెల 22న మూవీ టీం దుబాయ్‌కు బయలు దెరనుంది. అక్కడ ఏప్రిల్ 15 వరకు చిత్రీకరణ కొనసాగించనున్నారు.ఈ షెడ్యూల్‌లో కీర్తీ సురేస్ సహా కీలక నటులు పాల్గొననున్నారు.ఇదిలా ఉంటే ఈ చిత్రం బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







