అంతర్జాతీయ టెన్నిస్‌లో నొవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డు
- March 09, 2021
ఆస్ట్రేలియా:సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ అంతర్జాతీయ టెన్నిస్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్ గా నిలిచిన ఆటగాడిగా చరిత్రకు ఎక్కాడు.ఈ సందర్బంగా రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఐదు దఫాల్లో 311 వారాలు అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు జకోవిచ్ 18 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు గెలిచాడు.గత నెల్లోనే తొమ్మిదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీ దక్కించుకున్నాడు. అంతేకాకుండా 36 ఏటీపీ మాస్టర్స్ 1000 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. 2011, జులై 4న తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా ఆవిర్భవించిన జకోవిచ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







