వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు

- March 09, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు

కువైట్ సిటీ:వ్యాక్సిన్ తీసుకున్న వారికి తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉన్న వారు ఇకపై హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితులను ఎప్పుటికప్పుడు పరిక్షిస్తున్నామని, ఆ తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..ఇతర దేశాల నుంచి కువైట్ కు వచ్చే వాళ్లంతా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే..దౌత్యవేతలు, చికిత్స కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే వారు, ఉన్నత చదువుల కోసం వెళ్లి స్వదేశానికి తిరిగొచ్చే కువైట్ యువకులకు మాత్రం తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com