కారులో భారీగా డబ్బు తరలింపు..పట్టుకున్న ఖతార్ కస్టమ్స్
- March 09, 2021
ఖతార్: కారులో డబ్బు దాచి ఖతార్లోకి రాబోయిన వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి భారీ మొత్తంలో నగదు సీజ్ చేశారు. ఖతార్ చట్టాల ప్రకారం దేశంలోకి వచ్చేవారైనా, దేశం విడిచి వెళ్లే వారైనా 50,000 రీయాల్స్ కి పైగా నగదు ఉన్నా, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నా ముందుగా డిక్లరేషన్ ఫామ్ లో స్పష్టంగా తెలియజేయాలి. కానీ, తనిఖీల్లో పట్టుబడిన నిందితులు డిక్లరేషన్ ఫామ్ లో నగదు విషయాన్ని స్పష్టం చేయలేదని అధికారులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే కారులో నగదు దాచి అధికారుల కళ్లుగప్పేందుకు ప్రత్నించారని సీజర్ రిపోర్ట్ లో అధికారులు అభియోగించారు. నిందితులపై మనీలాండరింగ్, టెర్రరిజం ఫైనాన్సింగ్ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







