బిగ్ బాస్ ఫేం కు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
- March 09, 2021
హైదరాబాద్: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక)కు ఆ డిపార్ట్‌మెంట్ షాకిచ్చింది. ఆమె వివరాలను తమ శాఖ వెబ్ సైట్ నుంచి మంగళవారం తొలగించింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామక పత్రాన్ని ఆమె సోమవారం అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సీఎంవో అధికారులకు సమాచారమివ్వకుండానే శ్రీనివాస్ గుప్తా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడంతో ఇలా జరిగిందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. ఈ మేరకు శ్రీనివాస్ గుప్తాను సీఎంవో అధికారులు మందలించినట్టు తెలిసింది.
యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హారిక.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఆ షోతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. తెలంగాణ అమ్మాయి కావడంతో టూరిజం అంబాసిడర్‌గా ఆమెను శ్రీనివాస్ గుప్తా నియమించారని సమాచారం. అయితే శాఖా పరమైన అనుమతులు తీసుకోకపోవడంతో తొలగించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







