పీసీఆర్ టెస్ట్ నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు

- March 09, 2021 , by Maagulf
పీసీఆర్ టెస్ట్ నుంచి కొన్ని వర్గాలకు మినహాయింపు

అబుధాబి: అబుధాబిలోకి వచ్చే వాళ్లందరూ తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తో రావాలని కండీషన్ పెట్టిన ఆరోగ్య శాఖ..కొన్ని వర్గాలకు మాత్రం పీసీఆర్ టెస్ట్ షరతుల నుంచి మినహాయింపు ఇచ్చింది. క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్లుగా ఉన్న వారు, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పౌరులు, ప్రవాసీయులు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకుండానే అబుధాబికి రావొచ్చని స్పష్టం చేసింది. అలాగే నాలుగు, ఎనిమిదో రోజున కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నట్లు, క్లినికల్ ట్రయల్స్ వాలంటీర్లుగా పాల్గొన్నట్లు వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అందుకు అల్ హోస్న్ యాప్ లో గోల్డ్ స్టార్, లెటర్ని అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అబుధాబికి వచ్చే వాళ్లంతా తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ చూపించాలని ఆరోగ్య శాఖ షరతు విధించిన విషయం తెలిసిందే. అబుధాబి చేరుకునే సమయానికి 48 గంటల్లోపు జారీ చేసిన రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అలాగే పది రోజులకుపైగా అబుధాబిలోనే ఉంటే..నాలుగో రోజు, ఎనిమిదో రోజు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు 24 గంటల్లోపు తీసుకున్న డీపీఐ టెస్ట్ రిపోర్ట్ ను పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించిన అబుధాబి అధికారులు..వరుసగా రెండో సారికి మాత్రం డీపీఐ టెస్ట్ రిపోర్టును పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com