తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 10, 2021
హైదరాబాద్: తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 189 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 176 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,342కు చేరగా.. రికవరీ కేసులు 2,96,916కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1646 మంది మృతిచెందారు.. రికవరీ రేటు దేశంలో 96.9 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.85 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,780 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 693 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 39,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 90,55,741కు పెరిగింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్







