ఇఫ్తార్ విందులపై నిషేధం విధించిన షార్జా
- March 10, 2021
షార్జా:కోవిడ్ తీవ్రత కొనసాగుతుండటంతో ఇఫ్తార్ విందు, ఇఫ్తార్ మీల్స్ పంపిణీపై షార్జా అత్యవసర, విపత్తుల నిర్వహణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.ఎమిరేట్స్ పరిధిలో ఇఫ్తార్ విందులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయటం, పేదలకు, కార్మికులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేయటం పవిత్ర కార్యంగా భావిస్తారు. అయితే..ప్రస్తుతం వైరస్ ముప్పు వెంటాడుతున్న పరిస్థితుల్లో ఇఫ్తార్ విందు నిర్వహణతో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కుటుంబాలు, ఇతర సంస్థలు నిర్వహించే ఇఫ్తార్ విందులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.అలాగే రెస్టారెంట్ల ఎదుట, మసీదులు, నివాసాల ఎదుట,కార్లలో వెళ్లి ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేయటంపై కూడా నిషేధం అమలులో ఉన్నట్లు తెలిపారు. ఇఫ్తార్ మీల్స్ ఆఫర్లతో జనం గుమికూడే అవకాశాలు ఉండటంతో స్పెషల్ ఆఫర్లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. అయితే..ఎమిరాతి నుంచి గుర్తింపు పొందిన స్వచంద సంస్థలు మాత్రమే ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేసేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన అధికారులు..కోవిడ్ రూల్స్ ను బ్రేక్ చేసినట్లు ఎవరైనా గుర్తిస్తే వెంటనే 901కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.
తాజా వార్తలు
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు







