'వేవ్' వారి 'మిస్టర్ పర్ఫెక్ట్-2016'
- February 28, 2016
దుబాయ్ లో తొలిసారిగా కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన మిస్టర్ పర్ఫెక్ట్ ఈవెంట్ 26.02.2016 వ తేదిన బర్ దుబాయ్ లోని మూవ్ ఎన్ పిక్ హోటల్ లో కన్నుల పండుగగా జరిగింది. దుబాయ్ లో నివసించే మగవారి అలంకరణకి సంభందించిన వివిధ విభాగాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ ని ఎంపిక చేయటానికి వేవ్ రిసోనెన్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తమ వస్త్రధారణ , ఉత్తమ సాంప్రదాయ వస్త్రధారణ,ఉత్తమ కేశాలంకరణ లాంటి 22 విభాగాల్లో విజేతగా నిలవటం కోసం పలువురు పోటీ పడ్డారు. ప్రతీ విభాగం లోనూ ఒక్కొక్కరు విజేతగా నిలవగా " మిస్టర్ పెర్ఫెక్ట్ -2016" టైటిల్ ని విజయభాస్కర్ గెలుచుకున్నారు. వేవ్ రిసోనెన్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదంగా సాగింది. రావెళ్ళ రమేష్ బాబు , విజయకుమార్ , సాంబ , శ్రీనివాస్ పబ్బా , మధుసూదన్ ,నీలం శ్రీనివాస్ ఈ వేడుకని నిర్వహించగా అజిత్ ,ఇమ్రాన్ , సురేష్ బాబు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. న్యాయనిర్ణేతలుగా శివకుమార్ , షేక్ నాగూర్ విజేతలను ఎంపిక చేశారు.కార్యక్రమాన్ని సృజనాత్మకం గా రూపొందించి ఎంతో సమర్ధవంతంగా నిర్వహించిన వేవ్ నిర్వాహకులను ఆహుతులంతా అభినందించారు.ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు జరగాలని వచ్చిన అతిధులంతా అభిలషించారు.
వివిధ విభాగాల్లో విజేతల వివరాలు :
1. సంప్రదాయ వస్త్రధారణ : డి. విజయకుమార్
2. అధికారిక వస్త్రధారణ : అన్సార్ బాషా
3. సాధారణ వస్త్రధారణ : వేణుగోపాల్
4. ఉపకరణాలు : దుర్గా చారి
5. కేశాలంకరణ : జయ నరసింహారావు
6. పాదరక్షలు : ఉమేష్
7. కోపధారి - ఆజానుబాహుడు : చైతన్య కుమార్ కర్ణ
8. దేహ ధారుడ్యం : సేతిరాజులు నాయుడు
9. గడ్డం : అజిత్
10. కోరమీసం : ఉమేష్
11. వర్ణం : ఇంతియాజ్ అహ్మద్
12. నవ్వు - చెక్కిలి నొక్కు : సురేష్ రొవెయ్
13. నడక : చైతన్య
14. ఉత్సాహం - వినోదం : ఇర్ఫాన్
15. నృత్యం : సుధాకర్
16. గాయకుడు - శివ కుమార్
17. విదూషకుడు : బ్రహ్మ్మనందం
18. ధ్వని అనుకరణ : శశి కుమార్
19. పచ్చబొట్టు : మోహన్ రెడ్డి
20. ఫోటోజెనిక్ ఫేస్ : హరీష్ మూరంశెట్టి
21. స్వీయ చిత్రం : S. Dasari




తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







