భారతీయుల కంపెనీల మీద ఫోకస్
- March 12, 2021
అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికాలో భారతీయులు ఏర్పాటు చేసిన కొన్ని కొన్ని సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. దీనితో బైడెన్ వాళ్లకు ఆర్ధికంగా అండగా నిలవాలని భావిస్తున్నారు. భారతీయుల కంపెనీల మీద ఫోకస్ చేసి... అక్కడ ఉన్న యజమానులతో ఆయన సమావేశం కానున్నారు. వర్చువల్ మీటింగ్ త్వరలో జరగనుంది.
వ్యాపారులకు ఆర్ధిక సహాయం కూడా అందించే ప్రయత్నం బైడెన్ సర్కార్ చేసే అవకాశం ఉంది. దాదాపుగా వెయ్యి మందితో ముందు రాష్ట్రాల వారీగా సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఈ సమావేశం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. భారతీయులు అమెరికా అభివృద్దిలో ముందు నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు అమెరికా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ట్రంప్ ఉన్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో భారతీయులు ఉండేవారు. కాని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకుండా మార్చే ఆలోచనలో బైడెన్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఏం చేస్తారు ఏంటీ అనేది చూడాలి.
తాజా వార్తలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!







