మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి

- March 12, 2021 , by Maagulf
మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాన్స్టెన్సీ మాణిక్ బంధర్  గ్రామానికి చెందిన రవీందర్ దావత్ (35) అనే కువైట్ కార్మికుడు గుండెపోటుతో వారం క్రితం మరణించడం జరిగింది.ఈ విషయాన్ని మృతుని బందువులు నిజామాబాద్ MLC కె.కవిత దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.తెలంగాణ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి కువైట్ లో ఉంటున్న తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ ముత్యాల వినయ్ కి సమాచారం అందించడం జరిగింది వినయ్ ముత్యాల  వెంటనే మృతుడి కంపెనీ మ్యానేజ్మెంట్ తో మాట్లాడి దానికోసమయ్యే పార్మలిటిస్ పూర్తి చేశారు. తెలంగాణ జాగృతి కువైట్ జనరల్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క కువైట్ లో లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ ఎంతో ప్రయాసకోర్చి రవీందర్ పనిచేస్తున్న కంపెనీ మేనేజ్మెంట్ తో సహకారంతో డాక్యుమెంటేషన్, ప్రాసెస్ పూర్తి చేశారు.

అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడ కల్పించడం జరిగింది. (10/03/2021) రవీందర్ దావత్  పార్థివదేహాన్ని వారి స్వగ్రామానికి చేర్చడం జరిగింది.మరియు ఇందుకు సహకరించిన తెలంగాణ జాగృతి కువైట్ కోర్ కమిటీ సభ్యులు మొహమ్మద్ సైఫుద్దీన్, మామిడిపల్లి రాజన్న,వారం రాజశేఖర్ మరియు కిరణ్ కుమార్ గుర్రంకి జాగృతి కువైట్ ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల ధన్యవాదాలు తెలిపారు.వినయ్ ముత్యాల మాట్లాడుతూ కువైట్ లో ఉన్న తెలంగాణ గల్ఫ్ కార్మికుల కి ఎటువంటి ఇబ్బందులు కలిగినా  తెలంగాణ జాగృతి కువైట్ అండగా ఉంటుందని తెలిపారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com