రేవ్ పార్టీపై సీపీ మహేష్ భగవత్ ప్రెస్‌ మీట్

- March 12, 2021 , by Maagulf
రేవ్ పార్టీపై సీపీ మహేష్ భగవత్ ప్రెస్‌ మీట్

హైదరాబాద్:హైదరాబాద్‌ శివారులో రేవ్‌ పార్టీలో రెచ్చిపోయింది యువత.. దీనిపై ప్రెస్ మీట్ లో పూర్తి సమాచారం ఇచ్చారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.. పక్కా సమాచారంతోనే రేవ్‌ పార్టీపై దాడి చేశామన్నారు రాచకొండ సీపీ... రేవ్‌ పార్టీలో నార్కోటిక్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు.గంజాయితోపాటు ఎల్‌సీడీ డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు సీపీ.ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాత్మ ప్రొడక్షన్స్ పేరుతో గిరీష్ అనే వ్యక్తి పార్టీపై పోస్టు పెట్టాడని తెలిపారు.నిర్వాహకులపై ఎన్‌డీసీపీ, ఎక్సైజ్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద, పాల్గొన్న వారిపై సెక్షన్ 188, 294 కింద కేసులు పెట్టామన్నారు.డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.

ఇక, రేవ్‌ పార్టీ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో పాల్గొన్నవారంతా సాఫ్ట్‌వేర్‌తో పాటు ప్రైవేట్‌ కంపెనీల ఉద్యోగులేనని చెప్తున్నారు. ఓ రాజకీయ పార్టీ నేత కుమారుడి తోటలో ఈ పార్టీ జరగడంతో.. పొలిటికల్‌ యాంగిల్‌ ఉందా అని విచారణ జరుపుతున్నారు.ఇది వీకెండ్ పార్టీనా లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకే నిర్వహించారా... అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 96 మందిని ప్రశ్నిస్తున్నారు. పరారైన 10మంది కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com