పాక్షిక కర్ఫ్యూ: రెసిడెన్షియల్ ప్రాంతాల్లో నడకపై హెచ్చరిక
- March 12, 2021
కువైట్ సిటీ:పాక్షిక కర్ఫ్యూ అమల్లో వున్నా,రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి వేళల్లో కూడా స్వచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు, వారిని అధికారులు నిరోధించలేకపోతున్నారు.పదుల సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.పిల్లలతో రావడం, వాకింగ్ చేయడం, సైక్లింగ్ చేయడం వంటివి చేస్తున్నారని అధికారులు తెలిపారు.సాయంత్రం వేళల్లో ఆ మాత్రం వెసులుబాటు లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయన్నది ఆయా ప్రాంతాల్లో ప్రజల వాదన.అయితే సెక్యూరిటీ అధికారి ఒకరు చెప్పినదాన్ని బట్టి క్యాబినెట్ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి వుందనీ, అలా ప్రజలు బయటకు రావడం నేరపూరిత చర్యగా పరిగణించాల్సి వస్తుందని తెలుస్తోంది. ప్రార్థనల కోసం బయటకు వెళ్ళేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు తప్ప, జనం గుమికూడేందుకు అవకాశమివ్వడంలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు వుంటాయనీ, ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







