'FCI'లో ఉద్యోగావశాలు..
- March 12, 2021
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈపోస్టులకు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఖాళీలు -89 వీటిని రెండు కేటగిరీలుగా విభజించారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మెడికల్ ఆఫీసర్ లకు దరఖాస్తులను కోరుతున్నారు.
1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు : 87
A. జనరల్ అడ్మినిస్ట్రేషన్ : 30
విద్యార్హతలు : సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల వయోపరిమితి
B. టెక్నికల్ : 27
విద్యార్హతలు : అగ్రికల్చర్ బీఎస్సీ, బి ఈ, బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. ఈపోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 1/1/2021 నాటికి 28 సంవత్సరాలు దాటకూడదు.
C. అకౌంట్స్ : 22
విద్యార్హతలు : ఇనిస్ట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, ఐసిఏఐ లో మెంబర్ షిప్ కలిగి ఉండాలి. ఈపోస్దులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 01/01/2021 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
D. న్యాయవాది : 8
విద్యార్హతలు : ఫుల్ టైం లా డిగ్రీపట్టా పొంది ఉండాలి. అంతేకాదు న్యాయవాదిగా ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. వయసు 01/జనవరి 2021 నాటికి 33 సంవత్సరాలు మించకూడదు.
2. మెడికల్ ఆఫీసర్ : 2
విద్యార్హతలు : ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత పనిలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి . వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు.
ఎంపిక విధానం : రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఇంటర్వ్యూ కి షార్ట్ లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను పంపాల్సిన చివరి తేదీ 31 మార్చి. ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ http://www.fci.gov.in ను చూడవచ్చు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







