వాట్సాప్ లో కొత్త ఫీచర్స్...
- March 12, 2021
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ అందించబోతోంది.వాట్సాప్‌లోని మీ ఛాట్స్‌కి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. మీ ఛాట్స్‌ని బ్యాకప్ చేసినప్పుడు పాస్వర్డ్ సెట్ చేయాలి. మళ్లీ మీరు ఆ ఛాట్స్ రీస్టోరే చేయాలనుకుంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సప్ బీటా యూజర్లు టెస్ట్ చేస్తున్నట్టు WABetaInfo సమాచారం ఇచ్చింది.ఈ ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ని కూడా షేర్ చేసింది.వాట్సాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌కి ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రస్తుతం వాట్సప్‌లోని ఛాట్స్ బ్యాకప్ చేస్తే గూగుల్ డ్రైవ్‌లోకి బ్యాకప్ అవుతుంది. దీనికి ఎలాంటి పాస్వర్డ్ ప్రొటెక్షన్ లేదు. ముఖ్యమైన ఛాట్స్ బ్యాకప్ చేయాలనుకునేవారి కోసం పాస్వర్డ్ ప్రొటెక్షన్ తీసుకొస్తోంది వాట్సాప్. పాస్వర్డ్ సెట్ చేస్తే ఆ ఛాట్స్‌ని రీస్టోర్ చేయాలంటే పాస్వర్డ్ తప్పనిసరి.
వాట్సాప్ ఛాట్స్ బ్యాకప్‌కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఫీచర్ ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటా యూజర్ అయితే మీ వాట్సాప్ యాప్ అప్డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. బీటా యూజర్లు విజయవంతంగా పరీక్షించిన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఇవే కాదు మరిన్ని ఫీచర్స్‌ని వాట్సాప్ అందించబోతోంది. ఇప్పటికే ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ టైమర్‌ని మార్చబోతోంది. ప్రస్తుతం వారం రోజులు మాత్రమే టైమ్ సెట్ చేయొచ్చు.వాట్సాప్ 24 గంటల ఫీచర్‌ని టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ఆన్ చేస్తే వాట్సాప్ లోని మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. ప్రస్తుతం వారం రోజుల పాత మెసేజెస్ డిలిట్ అవుతాయి.త్వరలో 24 గంటల్లోనే పాత మెసేజెస్ డిలిట్ చేయొచ్చు.
మరోవైపు సెల్ఫ్ డిస్స్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్‌ని కూడా పరీక్షిస్తోంది వాట్సాప్. ఫోటోలు ఆటోమెటిక్‌గా డిలిట్ అయ్యేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.వాట్సాప్ లో వచ్చే ఫార్వర్డ్ ఇమేజెస్, ఫోటోస్ యూజర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. వాటిని డిలిట్ చేసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ డిస్స్ట్రక్టింగ్ ఫోటోస్ ఫీచర్ వస్తే మీరు సెట్ చేసిన సమయానికి ఆ ఫోటోలు డిలిట్ అవుతాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







