ఉద్యోగ దరఖాస్తులపై ఒమన్ కార్మిక శాఖ క్లారిటీ
- March 12, 2021
ఒమన్:ఉద్యోగ దరఖాస్తులు, భర్తీ ప్రక్రియపై ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మంత్రిత్వ శాఖ వెబ్ సైట్లో పేర్కొన్న ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్లై చేయవచ్చని వెల్లడించింది. దీంతో ఆయా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలతో ఉన్న వ్యక్తులను త్వరగా గుర్తించి ఉద్యోగం ఇచ్చే వెసులుబాటు దక్కుతుంది. మంత్రిత్వ శాఖలో పేర్కొన్న ఉద్యోగాల కోసం తాము అప్లై చేయలేకోతున్నామని..తమ దరఖాస్తులను ఎందుకు స్వీకరించటం లేదంటూ కొందరు నిరుద్యోగులు లేవనెత్తిన సందేహాలపై మంత్రిత్వ శాఖ స్పందించింది. నిరుద్యోగుల దరఖాస్తులు ఎందుకు తిరస్కరించబడుతున్నాయో క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగ భర్తీ ప్రక్రియను వేగవంతం చేయటంలో భాగంగా ఒక్కో కంపెనీ 50 అప్లికేషన్ల వరకు మాత్రమే పరిమితి ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే కొన్ని కంపెనీలకు అప్లికేషన్లు వచ్చాయని తెలిపింది. అయితే..ఈ 50 అప్లికేషన్లను పరిశీలించి వారిని భర్తీ చేసుకోవటమో..లేదంటే వారిని రిజెక్ట్ చేయటమో చేసిన తర్వాతే కొత్త దరఖాస్తులను స్వీకరించేందుకు అనుమతి ఉంటుంది. 50 దరఖాస్తులను పరిశీలించే వరకు కొత్త అప్లికేషన్లను స్వీకరించేందుకు ఆయా కంపెనీలకు అనుమతి ఉండదు. ఒకవేళ కంపెనీలు 50 అప్లికేషన్లలో అనర్హుల దరఖాస్తులను రిజెక్ట్ చేస్తే ఆ వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందిని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







