మొబైల్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేసిన కువైట్
- March 12, 2021
కువైట్ సిటీ:కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వారి కోసం ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ పూర్తి అయిందని కువైట్ ప్రకటించింది. దేశంలోని ప్రజలు అందరికీ వ్యాక్సిన్ అందించటమే లక్ష్యంగా నిర్దేశించుకున్న కువైట్ ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ అందిస్తూ వస్తోంది. అయితే..వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే..పలు ఆరోగ్య కారణాలతో మంచానికే పరిమితమై కదల్లేని స్థితిలో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా మొబైల్ వ్యాక్సిన్ యూనిట్లను ప్రారంభించింది ప్రభుత్వం. కదల్లేని స్థితిలో ఉండి వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ అందిస్తూ వచ్చింది. ఎట్టకేలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లందరికీ వ్యాక్సిన్ అందించామని ప్రభుత్వం వెల్లడించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







