తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం...
- March 15, 2021
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగం ప్రారంభించారు. సమావేశాలకు సీఎం కెసిఆర్, మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం స్పీకర్ పోచారం అధ్యక్షతన బీఏసీ(సభా వ్యవహారాల సంఘం) సమావేశం కానుంది.
ఈ నెల 18న అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19వ తేదీన సెలవు ఉంటుంది. ఆ తదుపరి రోజు నుంచి బడ్జెట్‌పై చర్చలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తొలిసారి అడుగు పెట్టారు. అలాగే, నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితతో పాటు గవర్నర్ కోటాలో ఎన్నికైన ముగ్గురు మండలిలో తొలిసారి అడుగు పెట్టనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష