ఆస్కార్-2016 విజేతలు..
- February 28, 2016
అమెరికాలోని లాస్ఏంజిల్స్ డాల్బీ థియేటర్లో 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నటుడు క్రిస్‌రాక్ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాలీవుడ్ తారాగణం విచ్చేసి సందడి చేసింది. హస్యనటుడి గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ తన ఛలోక్తులతో కార్యక్రమాన్ని ఆద్యంతం నవ్వులతో ముంచెత్తారు. 'బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్' చిత్రానికి గానూ ఉత్తమ సహాయ నటుడిగా మార్క్ రిలేన్స్, ఉత్తమ సహాయనటిగా 'ద డానిష్ గర్ల్' చిత్రానికి అలీసియా వికందర్‌లకు అవార్డులు దక్కాయి. మొత్తం 10 విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయిన 'మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్' చిత్రం ఆరు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది.
ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందడి చేశారు. ఆస్కార్ విజేతకు అవార్డును ప్రదానం చేశారు. ఇక హాలీవుడ్ భామలు వినూత్న వస్త్రధారణతో రెడ్ కార్పెట్‌పై హోయలొలికిస్తూ చేసిన క్యాట్‌వాక్‌లు ప్రేక్షకుల మతి పోగొట్టాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్కార్ వేదికను విభిన్నంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌దీప కాంతుల్లో ఆస్కార్ వేదిక మెరిసిపోయింది. తొలిసారి ఆస్కార్ అవార్డు దక్కించుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. * ఉత్తమ సహాయనటుడు: మార్క్ రేలేన్స్(బ్రిడ్జి ఆఫ్ స్పైస్) * ఉత్తమ సహాయనటి: అలీసియా వికందర్(ద డానిష్ గర్ల్) * ఉత్తమ ఛాయాగ్రహణం: ఎమ్మాన్యుయెల్ లుబెజ్కి (ద రివెనంట్) * ఉత్తమ యానిమేషన్ చిత్రం: ఇన్సైడ్ అవుట్ * ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: స్పాట్లైట్ * ఉత్తమ సంగీతం: ద హేట్ ఫుల్ ఎయిట్ (మోరిక్‌వన్) * ఉత్తమ పాట: రైటింగ్స్ ఆన్ ద వాల్ (స్పెక్టర్) * ఉత్తమ వస్త్రాలంకరణ: జెన్నీ బెవన్ (మ్యాడ్ మ్యాక్ ఫ్యూరీరోడ్) * ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్బన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్) * ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ: లేస్సీ వాండర్‌వాల్ట్, ఎల్కా వార్టెగా, డేమియన్ మార్టిన్ (మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్) * ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: మార్క్ మంగిని అండ్ డేవిడ్ వైట్(మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ్ సౌండ్ మిక్సింగ్: క్రిస్ జెంకిన్స్, గ్రెగ్ రడ్లాఫ్, అండ్ బెన్ ఓస్మో( మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరెడ్ సిజెల్ (మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్) * ఉత్తమ విజువల్ ఎఫెక్ట్: ఎక్స్‌మెకినా (ఆండ్రూ వైట్ హస్ట్, పాల్ నోరిస్, మార్క్ అర్డింగ్టన్ అండ్ సరా బెన్నెట్) * ఉత్తమ షార్ట్ ఫిల్మ్(యానిమేటెడ్): బేర్‌స్టోరీ (గాబ్రియల్ ఒసోరియో అండ్ పటో ఎస్కాలా * ఉత్తమ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్: ఇన్సైడ్ అవుట్(పీట్ డాక్టర్ అండ్ జోనన్ రివెరా) * ఉత్తమ్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: ఎమీ (అసిఫ్ కపాడియా అండ్ జేమ్స్ గేరీస్) * ఉత్తమ షార్ట్ ఫిల్మ్: షట్టరర్ (బెంజిమన్ క్లియరీ అండ్ సెరీనా అమృతేజ్) * ఉత్తమ విదేశీ చిత్రం: ఆన్ ఆఫ్ సాల్(నీమ్స్, హంగరీ)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







