బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ఆశలు ...

- February 28, 2016 , by Maagulf
బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ఆశలు ...

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్‌ ఆశలు పెట్టుకుంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని బడ్జెట్‌ ద్వారా ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు పంపింది. ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చెబుతున్న కేంద్రం... బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు, రాయితీలు ఇస్తుందోనని ప్రభుత్వం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. * రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. * వెనకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు * అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు * విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు నిధులు * అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి రాయితీ * పరిశ్రమలకు అన్నిరకాల మిహాయింపులు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన * పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.4వేల కోట్లు * ఓడరేవుల అభివృద్ధికి నిధులు * జాతీయ విద్యాసంస్థల అభివృద్ధికి రూ.3,500 కోట్లు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com