భారత్ ను వణికిస్తున్న కరోనా...సీఎంలతో మోదీ భేటీ
- March 17, 2021
కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాష్ట్రాల మఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ భేటీలో కరోనా తాజా పరిస్థితులు, వైరస్ నియంత్రణ, వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరును ప్రధాని సమీక్షిస్తున్నారు. కాగా.. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు భూపేశ్ భగేల్, మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.
గతేడాది కొవిడ్ ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. టీకా ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరిలోనూ ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నేడు మరోమారు సమీక్ష చేపట్టారు.
దేశంలో గత కొంతకాలంగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మొత్తం నమోదవుతున్న కేసుల్లో 80శాతానికి పైగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. 60శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా.. తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్‌లోనూ కేసులు నానాటికీ పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







