వచ్చే విద్యా సంవత్సరంలోనూ హైబ్రిడ్ స్కూలింగ్
- March 18, 2021
యూఏఈ:కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నిర్వహణపై యూఏఈ విద్యా శాఖ ఫోకస్ చేసింది. విద్యార్ధులను వైరస్ బారి నుంచి కాపాడేందుకు ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువగా రిమోట్ టీచింగ్ కే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే..వచ్చే ఏడాదికి సంబంధించి ఓ నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లేలా రిమోట్ లెర్నింగ్, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ నిర్వహించేలా హైబ్రిడ్ స్కూలింగ్ విధానాన్ని సిద్ధం చేస్తున్నారు. అంటే వచ్చే విద్యా సంవత్సరంలో అవసరమైన మేర ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో విద్యార్ధుల్లో నైపుణ్యత పెంచేందుకు మాత్రం కొంత సమయం ప్రత్యక్ష తరగుతులకు హజరుకావాల్సి ఉంటుంది. అంటే ల్యాబ్ క్లాసెస్, సాంకేతిక అంశాలు, విద్యార్ధుల మధ్య టీం వర్క్ స్కిల్స్, క్రీడలకు సంబంధించిన అంశాల సాధనకు విద్యార్ధులు స్కూల్ కి హజరయ్యేలా వచ్చే అకాడమిక్ ఇయర్ కు విద్యా విధానాన్ని రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







