తెలంగాణలో పొలిటికల్ హీట్...
- March 19, 2021
హైదరాబాద్:తెలంగాణలో మరో పొలిటికల్ పార్టీ వెలుస్తుందా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.వైఎస్ కూతురిగా,ఏపి సీఎం జగన్ సోదరిగా అందరికి సుపరిచితురాలైన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని స్థాపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఏప్రిల్ 9 వ తేదీన ఖమ్మంలో పార్టీని ప్రకటించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది.తెలంగాణలోని జిల్లాల నేతలతో షర్మిల సంప్రదింపులు జరుపుతున్నారు.రాజన్న రాజ్యం కోసం రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.జిల్లాల నేతలతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా వైఎస్ షర్మిలను కలుస్తున్నారు.తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు,టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా ఈరోజు వైఎస్ షర్మిలను కలిశారు.ఈ ఇద్దరు వైఎస్ షర్మిల పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.అయితే, మర్యాదపూర్వకంగానే వైఎస్ షర్మిలను కలిసినట్టు మహ్మద్ అసుదుద్దీన్,ఆనం మీర్జాలు పేర్కొన్నారు.ఒకవేళ ఈ ఇద్దరు షర్మిల పార్టీలో చేరితే, మరికొంతమంది సెలెబ్రిటీలు కూడా షర్మిల పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







