ఆరోగ్య రంగానికి పెద్దపీట !
- February 29, 2016
ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని హామీయిచ్చారు. కేంద్ర 2016-17 ఆర్థిక బడ్జెట్ ను సోమవారం లోక్ సభలో ఆయన ప్రవేశపెట్టారు.ఆయన ఇంకా ఏం చెప్పారంటే.... 'ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా పాడైతే కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఇందుకోం కొత్త పథకం ప్రవేశపెడుతున్నాం. కొత్త ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబానికి లక్ష రూపాయలు, సీనియర్ సిటిజన్లకు అదనంగా రూ. 30 వేలు ప్రయోజనం అందజేస్తాం. జెనెరిక్ మందులను అందించేందుకు అదనంగా దుకాణాలు ఏర్పాటుచేయిస్తాం, ఈ మందులు మరింత చౌక కానున్నాయి.
మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి కోసం డయాలసిస్ ఖర్చు ఏడాదికి రూ. 3 లక్షలు అవుతోంది. పీపీపీ మోడ్‌లో జాతీయ డయాలసిస్ సర్వీస్ కార్యక్రమం అన్ని జిల్లా ఆస్పత్రులలో ప్రారంభం అవుతుంది. డయాలసిస్ పరికరాల మీద బేసిక్ కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు మినహాయిస్తున్నాం. 300 జనరిక్ జౌషధ దుకాణాలను త్వరలోనే ప్రారంభిస్తాం
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







