టీఆర్‌ఎస్‌ నేత గన్‌తో హల్‌చల్!‌

- March 21, 2021 , by Maagulf
టీఆర్‌ఎస్‌ నేత గన్‌తో హల్‌చల్!‌

హైదరాబాద్:తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. రెండు స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్.దీంతో.. టీఆర్ఎస్ శ్రేణులు జోష్‌లోకి వెళ్లిపోయాయి.. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.. ఈ సంబరాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నేత గన్‌తో హల్‌చల్‌ చేశాడు.  నిన్న ఎమ్మెల్సీ సంబరాల్లో గన్‌ తెచ్చిన గ్రేటర్‌ మాజీ అధ్యక్షుడు  కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌... గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు.  అయితే పక్కనున్నవారు ఆపడంతో కట్టెల శ్రీనివాస్‌ గన్‌లోపల పెట్టుకున్నాడు. అయితే... దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రేటర్‌ మాజీ అధ్యక్షుడు  కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌కు అసలు ఆ గన్‌ ఎక్కడిది... ఎవరూ ఇచ్చారు అనేది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. అయితే... లైసెన్స్‌డ్‌ అని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. కాగా.. ఇదే సంబరాల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పటాకులు కాలుస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటుండగా.. నిప్పురవ్వలు వెళ్లి పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్లపై పడి మంటలు చేలరేగాయి. దీంతో.. అప్రమత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు,అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక సిబ్బంది.కట్టెల శ్రీనివాస్ తీరుపై పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com