దమ్ ఆలూ
- May 30, 2015
కావలసిన పదార్ధాలు:
- బంగాళాదుంపలు - 6 (చిన్నవి)
- జీడిపప్పు - 1 టేబుల్ స్పూను
- కోవా - 100 గ్రా
- మీగడ - 1 టేబుల్ స్పూను
- ఎండుద్రాక్ష - 100 గ్రా
- జీడిపప్పు ముద్ద - 1 టేబుల్ స్పూను
- ఉల్లిముద్ద - 1 టేబుల్ స్పూను
- అల్లం వెల్లుల్లి - 1 టేబుల్ స్పూను
- టమాటో గుజ్జు - 1 టేబుల్ స్పూను
- పచ్చిమిర్చి - 2
- జీలకర్ర పొడి - 1 టీ స్పూను
- ధనియాల పొడి - 1 టీ స్పూను
- గరం మసాలా - 1 టీ స్పూను
- చాట్ మసాల - 1/2 టీ స్పూను
- నూనె - తగినంత
- కొత్తిమీర - కట్ట
- ఉప్పు - తగినంత
చేయు విధానం:
- బంగాళాదుంపల తొక్కు తీసి చాకుతో మధ్యలో డొల్లలా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.
- తరవాత కోవా, సన్నగా తరిగిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, చాట్ మసాలా అన్నీ కలిపి మధ్యలో నింపాలి.
- గ్రేవీ కోసం:
- బాణీలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముద్ద వేసి ఎర్రగా వేయించాలి.
- తర్వాతా టమాటో గుజ్జు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి.
- ఇప్పుడు మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు ముద్ద వేసి తగినన్ని నీళ్ళుపోసి కలిపి కొత్తిమీర చల్లి ఉడికించాలి.
- దగ్గరగా ఉడికాక ఉప్పు సరిచూసి మీగడతో అలంకరించి దించాలి.
- స్టఫ్ చేసిన ఆలూని ఈ గ్రేవీలో వేస్తే సరి.
------ వి.జానకి జ్యోతి, సింగపూర్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







