వైట్ హౌస్‌లో 'ఎ.ఆర్.రహమాన్'
- May 31, 2015
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన 'జై హో' డాక్యుమెంటరీని వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ ని ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు రెహమాన్ వ్యక్తిగత జీవితం, వృత్తిగత విశేషాలను, ఆయన సంగీతంలో చూపించిన వైవిధ్యాన్ని ఈ డాక్యుమెంటరీలో పొందుపరిచారు దర్శకుడు ఉమేష్ అగర్వాల్. ఆస్కార్, గ్రామీ పురస్కారాలు అందుకున్న నాటి విషయాలకూ ఇందులో చోటు కల్పించారు. రెండు ఆస్కార్లు అందుకుని భారతీయ సినిమా కీర్తిని ఇనుమడింపజేసిన స్వర తరంగం ఎ.ఆర్.రెహమాన్ - తనకు ఆస్కార్‌పై ఆశలుపోయాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ ''దాదాపు 12 సంవత్సరాల తరవాత ఓ కచేరి నిర్వహించబోతున్నాను. ఇలాంటి కార్యక్రమం చేయాలని ఎప్పటి నుంచో ఆశగా ఉండేది. ఇప్పటికి నెరవేరుతోంది. ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు తీసుకున్న తరవాత ఆ పురస్కారమ్మీద మోజుపోయింది. తమిళ చిత్రాలకు సంగీతం అందించడం చూసి.. బాలీవుడ్‌లో 'మాకెందుకు చేయట్లేదు' అని అడుగుతున్నారు. నాకు అలాంటి తారతమ్యాలు లేవు'' అన్నారాయన . చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో మీ అబ్బాయి ఆమీన్ - పియానో వాయించారు. మరి ఈ కచేరీల్లో కూడా పాల్గొంటారా? అన్న ప్రశ్నకు.. ''అతనిప్పుడు సంగీతం బాగా నేర్చుకుంటున్నాడు. నేను రూపొందించిన ఆల్బంలో నటించాడు. అమీన్ కూడా ఆల్బం రూపొందించే ఆలోచనలో ఉన్నాడు''అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







