దమ్ ఆలూ

- May 30, 2015 , by Maagulf
దమ్ ఆలూ

 

కావలసిన పదార్ధాలు:

  • బంగాళాదుంపలు - 6 (చిన్నవి)
  • జీడిపప్పు            - 1 టేబుల్ స్పూను
  • కోవా                  - 100 గ్రా
  • మీగడ                - 1 టేబుల్ స్పూను
  • ఎండుద్రాక్ష           - 100 గ్రా
  • జీడిపప్పు ముద్ద    - 1 టేబుల్ స్పూను
  • ఉల్లిముద్ద            - 1 టేబుల్ స్పూను
  • అల్లం వెల్లుల్లి        - 1 టేబుల్ స్పూను
  • టమాటో గుజ్జు      - 1 టేబుల్ స్పూను
  • పచ్చిమిర్చి          - 2
  • జీలకర్ర పొడి          - 1 టీ స్పూను
  • ధనియాల పొడి     - 1 టీ స్పూను
  • గరం మసాలా        - 1 టీ స్పూను
  • చాట్ మసాల        - 1/2 టీ స్పూను
  • నూనె                  - తగినంత
  • కొత్తిమీర             - కట్ట
  • ఉప్పు                 - తగినంత

 

చేయు విధానం:

  • బంగాళాదుంపల తొక్కు తీసి చాకుతో మధ్యలో డొల్లలా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.
  • తరవాత కోవా, సన్నగా తరిగిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, చాట్ మసాలా అన్నీ కలిపి మధ్యలో నింపాలి.
  • గ్రేవీ కోసం:
  • బాణీలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముద్ద వేసి ఎర్రగా వేయించాలి.
  • తర్వాతా టమాటో గుజ్జు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలపాలి.
  • ఇప్పుడు మిగిలిన మసాలా దినుసులు, జీడిపప్పు ముద్ద వేసి తగినన్ని నీళ్ళుపోసి కలిపి కొత్తిమీర చల్లి ఉడికించాలి.
  • దగ్గరగా ఉడికాక ఉప్పు సరిచూసి మీగడతో అలంకరించి దించాలి.
  • స్టఫ్ చేసిన ఆలూని ఈ గ్రేవీలో వేస్తే సరి.

 

------ వి.జానకి జ్యోతి, సింగపూర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com