దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్: 1 మిలియన్ డాలర్లను పంచుకోనున్న 25 మంది కార్మికులు
- March 22, 2021
దుబాయ్:అల్ ఖోజ్‌లోని ఓ స్కూల్ రవాణా సర్వీసు కంపెనీ సంయుక్తంగా 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో గెలుచుకుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పురుషుల ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ డ్రా జరిగింది. రష్యా టెన్నిస్ ప్లేయర్ అలాగే టోర్నమెంట్ ఛాంపియన్ అయిన అస్లాన్ కరాట్సేవ్ ఈ డ్రా తీశారు. అతనికి ఇదే తొలి దుబాయ్ టైటిల్. కాగా, విన్నింగ్ టికెట్ 34 ఏళ్ళ భారత జాతీయుడు రాహుల్ కోవితాల తజెవెట్టిల్ పేరుతో వుంది. 12 ఏళ్ళుగా రాహుల్ సీనియర్ ఫైనాన్స్ అధికారిగా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన, ఆయన సహచరులు గత నాలుగేళ్ళుగా ఈ ప్రమోషన్‌లో భాగమవుతూ వస్తున్నారు. కేరళకు చెందిన రాహుల్, ఈ బహుమతి గెలుచుకున్న 178వ భారతీయుడిగా రికార్డులకెక్కారు. 1999లో మొదలైన ఈ ర్యాఫిల్ లో ఇప్పటిదాకా విజయం సాధించినవారిలో అత్యధికులు భారతీయులే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







