జయలలిత బయోపిక్ పిక్స్ అదరహో

జయలలిత బయోపిక్ పిక్స్ అదరహో

దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత నేపథ్యంలో ఏఎల్ విజయ్ తలైవి అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించగా, చిత్రం కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంది. జయలలిత ఏయే వయస్సులో ఎలా ఉందో కంగనా కూడా చిత్రంలో అలా కనిపించేందుకు చాలా శ్రమించింది. ఓ సందర్భంలో 20 కేజీల బరువు పెరిగిన కంగనా రనౌత్ కొన్ని నెలలోనే మళ్లీ తగ్గింది. తలైవీ సినిమా కోసం ఎన్నో ఛాలెంజ్‌లు స్వీకరించిన కంగనా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

కంగనా సినిమాలోని కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. కొన్ని ఫోటోలలో లావుగా కనిపిస్తుండగా, మరికొన్ని ఫొటోలలో స్లిమ్‌గా కనిపిస్తుంది. భరత నాట్యం ఫోజిచ్చిన ఫొటో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తలైవి చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 26న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.

Back to Top