భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..మార్చి 31 నుంచి ప్రారంభం
- March 26, 2021
కువైట్ సిటీ:భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం సిద్ధమవుతోంది. ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడులకలను నిర్వహించాలన్న భారత ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నెల 31 నుంచి వేడుకలను నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్వాతంత్ర్య సన్నాహక వేడుకలను వర్చువల్ గానే నిర్వహిస్తారు. మార్చి 31న ఉదయం 10.30 గంటలకు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయని వెల్లడించిన రాయబార కార్యాలయం..ఈ వేడుకల్లో కువైట్లోని భారతీయులు, భారత శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా పాల్గొనాలని కోరింది. వేడుకల్లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు మార్చి 31న 10.15 గంటలకు జూమ్ ద్వారా సెలబ్రేషన్స్ లో జాయిన్ అవ్వొచ్చని వివరించింది. రాయబార కార్యాలయం వెల్లడించిన జూమ్ లాగిన్ వివరాలు https://zoom.us/j/91423908856?pwd=d1Q1bDJEQkdKQVBLZExlSE9Qejgxdz09. మీటింగ్ కోడ్ 914 2390 8856 , మీటింగ్ ఐడీ 681987.
తాజా వార్తలు
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు







