పేద దేశాలకు కోటి డోసుల వ్యాక్సిన్ ఇవ్వండి:టెడ్రోస్
- March 27, 2021
జెనీవా:సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు.2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.ఈ సందర్భంగా టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ.. పేద దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రారంభించిన కొవాక్స్ పథకాన్ని ప్రారంభించిందని, దీనికి టీకాల సరఫరా సమస్యల కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. అయితే 36 దేశాల్లో ప్రజలకు ఇచ్చేందుకు ఒక్క డోసు కూడా అందలేదని, రాబోయే రెండు వారాల్లో 16 దేశాలకు మొదటి డోసు అందనుందని తెలిపారు. మిగతా 20 దేశాలకు వ్యాక్సిన్లు అవసరమని, సంపన్న దేశాలు వ్యాక్సిన్‌ను విరాళంగా అందజేస్తే రాబోయే రెండు వారాల్లో ఆయా దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు టీకాలు వేయవచ్చని టెడ్రోస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







