భారత్ కరోనా అప్డేట్...
- March 28, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కేసులు భారీగా పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.ఇక కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 62,714 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,19,71,624కి చేరింది.ఇందులో 1,13,23,762 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,86,310 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 312 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,552కి చేరింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







