ఓట్స్ ఖరాబాత్
- March 28, 2021
కావాల్సిన పదార్ధాలు
1 కప్పు ఓట్స్
1 (సన్నగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయలు
2 (సన్నగా కట్ చేసుకోవాలి) టమాటాలు
అర కప్పు క్యారెట్ తురుము
అర కప్పు క్యాప్సికమ్ తరుము
టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తురుము
అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
అర టీ స్పూన్ కారం
అర టీ స్పూన్ గరం మసాలా
పావు టీ స్పూన్ పసుపు
1 కొత్తిమీర
టేబుల్ స్పూన్ నిమ్మరం
10 జీడిపప్పు
తగినంత ఉప్పు
టేబుల్ స్పూన్ నెయ్యి
టేబుల్ స్పూన్ శనగపప్పు
టేబుల్ స్పూన్ మినప్పప్పు
పావు టీ స్పూన్ ఆవాలు
2 రెమ్మలు కరివేపాకు
2 టేబుల్ స్పూన్స్ నూనె
తయారు చేయు విధానం..
- ముందుగా పాన్ వేడి అయ్యాక నూనె వేయకుండ ఓట్స్ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇందులో శనగపప్పు, మినప్పప్పు వేసి దోరాగా వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి.
- ఇందులో ఉల్లి తరుగు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తరువాత క్యారెట్, టమాట, క్యాప్సీకమ్, పసుపు కారం, గరం మసాల వేసి వేయించాలి. వేరొక పాత్రలో రెండున్నర కప్పుల నీరు పోసి మరిగించాలి.
- మరుగుతున్న నీళ్లలో వేయించి ఉంచ్చుకున్న ఓట్స్, టమాట మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
- ఇందులో వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, నెయ్యి వేసి కలిపి దించాలి.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!