కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి...

- March 28, 2021 , by Maagulf
కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి...

మయన్మార్:మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన కొనసాగుతోంది.  ఫిబ్రవరి 1 వ తేదీన మయన్మార్ లో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, జనరల్ మింగ్ అంగ్ లయాంగ్ సైనిక తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకున్నాడు. అప్పటి నుంచి దేశంలో ప్రజలు సైనిక పాలనకు నిరసిస్తూ తిరిగి దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న ఉద్యమకారులపై సైన్యం అణివేత చర్యలు చేపడుతోంది.  శనివారం రోజున నిరసనలు చేస్తున్న నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.  ఈ కాల్పుల్లో 114 మంది ప్రజలు మృతి చెందారు.  అనేక మంది గాయపడ్డారు.  ఈ ఘటనపై ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది.  మయన్మార్ సైనికపాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి.  అయితే, ఈ చర్య జరిగిన కొన్ని గంటలకు జనరల్ టీవీ లో ప్రసంగించారు.  త్వరలోనే దేశంలో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com