మండుతున్న ఎండలు
- March 28, 2021
మార్చి ఆరంభం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ సమ్మర్ జనాలకు చుక్కలు చూపించనుంది. రెండు రాష్ట్రాల్లో అప్పుడే వడగాలులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. వీటి ప్రభావంలో సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
రాష్ట్రంలోని మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉండనుంది. అటు, ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలతో పాటు వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే వడగాలులకు కారణమని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయంటున్నారు. పగటి పూట అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీళ్లు తాగుతూ…డిహైడ్రేషన్ బారి నుంచి కాపాడుకోవాలని చెబుతున్నారు. దాహం తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండం, మజ్జిగ తాగడం మంచిదని, మసాలా పదార్థారాలకు వీలైనంత దూరంగా ఉండాలని చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







